top of page

భారత దేశంలో పాటలు లేని సినిమాని అసలు ఊహించగలమా..? అది పౌరాణికమైనా, జానపదమైనా, చారిత్రాత్మకమైన లేదా సాంఘిక మైనా, పాటలు ఉండాల్సిందే. పాటలే సినిమాకు ప్రాణం అని ఎందరో మహానుభావులైన దర్శకులు నిరూపించారు, ఇప్పటికీ నిరూపిస్తున్నారు కూడా. పాటల శైలితోనే ఒక ప్రత్యేకమైన వాణి వినిపించిన దిగ్దర్శకులలో అగ్రగణ్యులు, హిందీలో రాజ్ కపూర్, తెలుగులో కే. రాఘవేంద్ర రావు, కే. విశ్వనాధ్ గార్లు. ఇప్పటి తరంలో(2K) వై.వి.ఎస్. చౌదరి, వంశి, కృష్ణ వంశి, సుకుమార్, రాజమౌళి ప్రసిద్ధులు.

ఒక సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ అవ్వాలన్నా లేదా ఇండస్ట్రీ హిట్ అవ్వాలన్నా పాటలు ఖఛ్చితంగా హిట్ అవ్వాలి. అప్పుడే ఆ సినిమాకి రన్ తో పాటు కలెక్షన్స్ కూడా అనూహ్యంగా ఉంటాయి. "తెలుగు సినిమా - శివ కు ముందు, శివ తరవాత" అనే రెండు ఆర్టికల్స్ రాయడం జరిగింది. ఆ ఆర్టికల్స్ 1932 నుండి 2023 వరకూ తెలుగు సినిమాని ఈ కింది విధంగా, 5 దశలుగా విభజన చేయడం జరిగింది.


బిగినింగ్ ఏజ్ (బాల్య దశ ) :

1932 నుండి 1945 వరకు 14 ఏళ్లు

యంగ్ ఏజ్ (యవ్వన దశ-స్వర్ణ యుగం) :

1946 నుండి 1969 వరకు 24 ఏళ్లు

మిడిల్ ఏజ్ (మధ్య దశ) :

1970 నుండి 1988 వరకు 19 ఏళ్లు

రిఫ్రెషింగ్  ఏజ్ (నవ్య  దశ ) :

1989 నుండి 1999 వరకు .. 11 ఏళ్లు

2కె ఏజ్ (మిలీనియం  దశ) :

2000 నుండి 2023 వరకు .. 23 ఏళ్లు


ఈ అయిదు దశలలో పాటల పరిణామ క్రమాన్ని ఒకసారి చూద్దాం. యవ్వన దశలో పౌరాణిక, చారిత్రాత్మక మరియు భక్తి రసాత్మక చిత్రాలు ఎక్కువగా రావటం వలన పాటల సంఖ్య అధికంగా ఉండేది. సుమారు 10 నుండి 30 పాటల వరకూ (పద్యాలతో కలిపి) ఉండేవి. బహుముఖ ప్రజ్ఞాశాలి అయినా శ్రీ చిత్తూరు వి నాగయ్య గారి సినిమా త్యాగయ్య(1946)లో 28 పాటలు ఉన్నాయి. అది యవ్వన దశ. ఆ యవ్వన దశ నుండి ఇప్పటి మిలీనియం దశ వరకూ తెలుగు, హిందీ, హాలీవుడ్  సినిమాలలో పాటల ప్రాముఖ్యతను పరిశీలిద్దాం.


తెలుగు :

పేరు-సంవత్సరం - పాటలు - నిడివి

త్యాగయ్య 1946 28 పాటలు .. 76:40 నిమిషాలు

మల్లీశ్వరి 1951  17 పాటలు .. 56:47 నిమిషాలు

భూ కైలాస్ 1951      17 పాటలు .. 60:30 నిమిషాలు

మిస్సమ్మ                    1955     11 పాటలు .. 32:25 నిమిషాలు

సీత రామ కళ్యాణం   1961    27 పాటలు .. 61:27 నిమిషాలు

లవ కుశ                      1963    38 పాటలు.. 82:21 నిమిషాలు

ప్రేమ నగర్                   1971     11 పాటలు  .. 43:55 నిమిషాలు

మేఘ సందేశం            1982     11 పాటలు  .. 56:10 నిమిషాలు

శ్రీ మద్విరాట్               1984    23 పాటలు .. 78:21 నిమిషాలు

గీతాంజలి                    1989    07 పాటలు .. 32:40 నిమిషాలు

నిన్నే పెళ్లాడుతా         1996   07  పాటలు .. 33:21 నిమిషాలు

చూడాలని వుంది        1998    06 పాటలు  .. 31:59నిమిషాలు

నరసింహ నాయుడు   2001     06 పాటలు .. 28:33 నిమిషాలు

ఖుషి                           2001     06 పాటలు  .. 30:14 నిమిషాలు

మురారి                      2001     07 పాటలు  .. 36:02 నిమిషాలు

లాహిరి-3 లో              2002    10 పాటలు  .. 45:10 నిమిషాలు

సీతయ్య                  2003    09 పాటలు .. 43:50 నిమిషాలు

ఒక్కడు                      2003    06 పాటలు .. 31:38 నిమిషాలు

హ్యాపీ డేస్                  2007    07 పాటలు .. 28:27 నిమిషాలు

దేవదాసు(వై వి ఎస్)  2007     11 పాటలు  .. 49:19 నిమిషాలు

బాహుబలి                  2015      08 పాటలు .. 27:08 నిమిషాలు

హుషారు                     2018      08 పాటలు .. 30:13* నిమిషాలు

ఆలా వైకుంఠ పురంలో-2020  06 పాటలు  .. 21:56 నిమిషాలు

RRR                             2022     07 పాటలు  .. 29:36 నిమిషాలు

దసరా                         2023     07 పాటలు  .. 28:10 నిమిషాలు

కమిటీ కుర్రోళ్ళు       2024      10 పాటలు  .. 35:10*నిమిషాలు

సరిపోదా శనివారం  2024     12  పాటలు .. 39:49* నిమిషాలు

 

పాటలే ప్రాణంగా ఆడిన సినిమాలు :


శంకరాభరణం      1980     11  పాటలు  .. 37:10 నిమిషాలు

సాగర సంగమం        1983    07  పాటలు  .. 31:10 నిమిషాలు

మయూరి                 1985    06  పాటలు .. 30:10 నిమిషాలు

సిరివెన్నెల               1986    10  పాటలు  .. 42:28 నిమిషాలు

స్వర్ణ కమలం             1988    10  పాటలు  .. 50:27 నిమిషాలు

నారీ నడుమ మురారి1990   06  పాటలు .. 29:23 నిమిషాలు

జగదేక వీ అ సుందరి1990   07  పాటలు .. 32:48 నిమిషాలు

పెళ్ళిసందడి             1996   09 పాటలు .. 40:10 నిమిషాలు

అన్నమయ్య          1997   20 పాటలు  .. 65:51 నిమిషాలు

ఒసేయ్ రాములమ్మ  1997   10 పాటలు  .. 51:21 నిమిషాలు

 శ్రీ రామదాసు          2006  19 పాటలు  .. 49:58 నిమిషాలు

స్టయిల్                    2006 07  పాటలు .. 31:46 నిమిషాలు

పాండు రంగడు         2008  15 పాటలు .. 43:33 నిమిషాలు

నమో వేంకటేశ         2017   12 పాటలు - 48:44 నిమిషాలు

 

HINDI :


Jhank jhank-

paayal baaje           1955   13 పాటలు ..  52:30 నిమిషాలు

Sree 420                    1955   08 పాటలు ..  38:50 నిమిషాలు

Mera naam joker     1970   10 పాటలు  .. 47:48 నిమిషాలు

Satyam sivam-

Sundaram                 1978   11 పాటలు  .. 48:15 నిమిషాలు

SIL SILA                         1981    13 పాటలు  .. 63:30 నిమిషాలు

Bobby                           1973   08 పాటలు  .. 38:15 నిమిషాలు

Prem rog                     1982   06 పాటలు  .. 44:05 నిమిషాలు

Ram teri ganga-

maili 1985 08పాటలు  .. 44:20 నిమిషాలు

Maine pyaar kiya      1989   12 పాటలు  .. 65:40 నిమిషాలు

Hum app hai koun    1994   14 పాటలు  .. 71:09 నిమిషాలు

Hum dil de -

chuke sanam            1999   11 పాటలు  .. 60:20 నిమిషాలు

TAAL                               1999  12 పాటలు  .. 64:28 నిమిషాలు

Lagaan                          2001  08 పాటలు  .. 41:58 నిమిషాలు

Devadas                      2002 10 పాటలు  .. 52:56 నిమిషాలు

TERE NAAM                     2003 13 పాటలు  .. 53:36 నిమిషాలు

Ab Tumhare

Hawale Watan

Sathiyo                   2004 09 పాటలు .. 59:16 నిమిషాలు

ROCK STAR                     2011   13 పాటలు  .. 63:20 నిమిషాలు

RamLeela                    2013  11  పాటలు  .. 47:02 నిమిషాలు

Aashiqee- 2                   2013  14 పాటలు  .. 71:09 నిమిషాలు

ABCD- 2                        2015  10 పాటలు  .. 43:33 నిమిషాలు

BaajiRao Masthani  2015  11 పాటలు  .. 50:40 నిమిషాలు

Jawaan                      2023 07 పాటలు . 25:29 నిమిషాలు

 

What is the difference between Indian cinema song and Hollywood sound track.


భారతీయ సినిమాలో పాట  అంటే లిరిక్ ఉంటుంది. లేదంటే నేపధ్య సంగీతంగానే ఉంటుంది. కానీ హాలీవుడ్ లో ఆలా కాదు. మన పాట ప్లేస్ లో అక్కడ సౌండ్ ట్రాక్ ఉంటుంది. దానికి లిరిక్ ఉండదు.  కానీ సౌండ్ ట్రాక్, కథని కానీ, క్యారెక్టర్ యొక్క స్వభావాన్ని కానీ ఎలివేట్ చేస్తుంది. అందుకే హాలీవుడ్ సినిమాకి సౌండ్ ట్రాక్ ని ప్రత్యేకంగా ఆల్బం రూపం లో రిలీజ్ చేస్తుంటారు. హాలీ వుడ్ లో ఆస్కార్ గెలుచుకున్న అన్ని సినిమాలలో సౌండ్ ట్రాక్ మినిమం ఒక గంట పైనే ఉంటుంది. ఉదాహరణకి టైటానిక్ మూవీ సౌండ్ ట్రాక్ ఒక గంటా పదకొండు నిమిషాలు. కింది జాబితాలో మరిన్ని ఉదాహరణలు ఉన్నాయి.


HOLLYWOOD OSCAR AWARD WINNING MOVIES – SOUND TRACK LENGTH  


Raiders of the Lost Ark            1981 - 19 SOUND TRACKS  .. 73:35 నిమిషాలు

Forrest Gump                          1994   - 34 SOUND TRACKS .. 97:30 నిమిషాలు

Titanic                                      1997    - 15 SOUND TRACKS .. 71 :20 నిమిషాలు

The Matrix-Reloaded    2003   -19 SOUND TRACKS .. 73:20  నిమిషాలు

The Soul                                   2020  - 42 SOUND TRACKS .. 64:15  నిమిషాలు

Life of Pi                                    2012    - 28 SOUND TRACKS .. 63:20  నిమిషాలు

Dune: Part One                         2021   - 09 SOUND TRACKS .. 101 :45*  నిమిషాలు

Oppenheimer                         2023   - 24 SOUND TRACKS .. 94:42   నిమిషాలు

Dune: Part Two                        2024   - 25 SOUND TRACKS .. 81 :02  నిమిషాలు


అయితే “పాటల విషయం లో” హాలీవుడ్ సినిమాని పూర్తిగా ఫాలో అయిన డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ గారిని మనం గుర్తించాలి. కార్తీ “ఖైదీ” విషయంలో ఆయన హాలీవుడ్ ని ఫాలో అయ్యారు. (ఆయన, ఈ సినిమాకి “డార్క్ నైట్” సినిమాని ప్రేరణగా ఎంచుకున్నారు). అందుకే ఆయనకి బాలీవుడ్ లో సైతం అంత డిమాండ్ వుంది. కార్తీ నటించిన ఖైదీ సినిమాలో 17 సౌండ్ ట్రాక్స్ ఉపయోగించారు. అందులో 5 సౌండ్ ట్రాక్స్ కి లిరిక్స్ వున్నాయి కానీ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుంటాయి. సో ఈ టెక్నీక్ బాగా పనిచేసి ఒక్క DUET కూడా లేని సినిమా box office దగ్గర దంచి కొట్టింది. లోకేష్ కనకరాజ్ గారి కోవలోనే తెలుగు లో ఇటీవలే వచ్చిన ఆయ్-మేం ఫ్రెండ్సండి, కమిటీ కుర్రోళ్ళు, సరిపోదా శనివారం సినిమా డైరెక్టర్లు కూడా హాలీవుడ్ స్టయిల్ ని ఫాలో అవుతూ సందర్భానుసారంగా ఎక్కువ పాటలు పెట్టి సక్సెస్ అయి రాబోయే దర్శకులకు ఒక దారి చూపించారు. ఈ మార్పు భవిష్యత్తులో మంచి సినిమాలు వస్తాయి అనే ఆశను కల్పిస్తుంది.(ఊరికినే సినిమాలు హిట్ అయిపోవు- దాని ఎనక “శానా కథ వుంటాదమ్మా .. సిట్టెమ్మా”)

 

అయితే హాలీవుడ్  సినిమాలలో కూడ మన లాగ లిరికల్ సాంగ్స్ ఉంటాయని చాలా మంది గమనించరు. మన ముంబై మురికివాడల నేపథ్యంలో తీసిన slum dog millionaire సినిమాలో 7 పాటలు(36-10 నిముషాలు duration) ఉన్నాయని చాలా మందికి తెలియదు. దానికి సంగీత దర్శకుడు మన రెహమాన్ అయినప్పటికీ, అన్ని పాటలకు కారణం మాత్రం దాని  డైరెక్టర్ DANNY BOYLE మాత్రమే. ఆ టేస్ట్ అందరికీ ఉండదు. అందుకే ఆ సినిమాకి 8 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఇంగ్లీష్ సినిమాలో కూడా 46 పాటలు వుంటాయని మొదటిసారి తెలుసుకున్నప్పుడు భలే ఆశ్చర్యం వేస్తుంది.  ఎందుకంటె పాటల రూపం లో సినిమా చెబితే మరింత అందంగా ఉంటుంది అని.  కాకపోతే అది సంగీత నేపధ్యం అయితే తిరుగే లేదు. హాలీవుడ్ ప్రేక్షకులు పాటలని ఎంత గా ఇష్టపడతారో ఈ క్రింది జాబితాలో ఆస్కార్ అవార్డులు సాధించిన సినిమాలు చూసి తెలుసుకోవచ్చు.




HOLLYWOOD OSCAR AWARD WINNING MOVIES with LYRICAL SONGS


The sound of music                       1965     16 పాటలు  .. 41:15***

THE WALL                                           1982      12 పాటలు  .. 31:53  

CHICAGO                                          2003  16 పాటలు  .. 61:44***

Mamma mia                                    2008     19 పాటలు  .. 70:13   

SLUM DOG MILLIANAIRE         2009     07 పాటలు  .. 36:10***

LESS MISERABLES                         2012     15 పాటలు  .. 40:13***

LA LA LAND                                    2016     07 పాటలు  .. 17:53***

THE GREATEST SHOWMAN     2017      11 పాటలు  .. 39:51   

Bohemian Rhapsody                     2018     22 పాటలు  .. 79:10***

Hamilton                                          2020    46 పాటలు  .. 132:15  

(చివరిలో " *** " వున్నవి ఆస్కార్ అవార్డుని సాధించిన సినిమాలు.)


అయితే అసలు  ఒక్క పాట కూడా లేకుండా హిట్ అయినా సినిమాలు కూడా వున్నాయి. వాటి కథా బలం వల్ల, వాటిని ప్రేక్షకులు ఆదరించారని మనం అర్థం చేసుకోవాలి.

ఆ చిత్రాలలో కొన్ని ఉదాహరణలు.


KAANOON-                  1960, Hindi.

PUSHPAKA VIMANAM- 1987, Telugu

ANTHIMA THEERPU-    1987, Telugu

VISARANAI-                2015, Tamil

U-TURN-                     2018, Tamil, Telugu


పాటల విషయం లో కొన్ని అద్భుతాలు మళ్ళీ జరగవేమో అనిపించే అద్భుతాలు :


  1. అతి పెద్ద పాట .. 20 నిమిషాల 16 సెకండ్లు

2004 అబ్ తుమ్హారే హవాలా వతన్ సాథియో

(టైటిల్ సాంగ్- టోటల్ మూవీలో పిక్చరైజషన్ )

  1. అతి చిన్న పాట .. 58 సెకండ్లు

2011 - జిందగీ న మిలేగి దుబారా -

సెన్యోరీట పాట

  1. ఎక్కువ పాటలు ఉన్న భారతీయ సినిమా

1932 - ఇందర్ సభ - 70 పాటలు

  1. తక్కువ పాటలు ఉన్న భారతీయ సినిమాలు

1966- తీసరీ కసం(హిందీ)

ఒకే పాట (సాజన్వా బైరి హో)

1972-సైలెంట్ రన్నింగ్

(ఇంగ్లీష్-science fiction)

ఒకే పాట (రెజోయిస్ ఇన్ ది సన్)

  1. ఒకే సినిమాలో ఎక్కువ పాటలు

    పాడుకున్న హీరోయిన్

    "పద్మ భూషణ్"

    శ్రీమతి భానుమతి రామ కృష్ణ

    1951 - మల్లీశ్వరి -13 పాటలు

    (పిలిచిన బిగువటరా వగైరా)

    (బి ఎన్ రెడ్డి -డైరెక్టర్ )

    It’s a unbeatable record till to date.

  2. సిరివెన్నెల సీతా రామ శాస్త్రి గారు రాసిన

    "జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది"

    అనే పాటను స్ఫూర్తిగా తీసుకుని, విపరీతంగా ప్రేమించిన గులాబీ దర్శకుడు కృష్ణ వంశి, ప్రభాస్ హీరోగా "చక్రం"

    సినిమా తీశారు. రిజల్ట్ ని పక్కన పెడితే ..

    Absolutely it's a DARE & RARE FEET.


CONCLUSION :


ఒక సినిమాకి ఎన్ని పాటలు ఉండాలి అనేదానికి ఎలాంటి ప్రమాణాలు వుండవు. అది దాని జోనర్ని బట్టి, కథని బట్టి, సంగీత దర్శకుడి శక్తీ సామర్ధ్యాలను బట్టి,  ఆధారపడి ఉంటుంది. మ్యూజిక్ అండ్ డాన్స్ back ground సినిమాలలో ఎన్ని పాటలు పెట్టినా జనం చూస్తారు. నో బౌండరీస్. సందర్భానుసారంగా వచ్చే పాటలు, సినిమా ఫీల్ ను పెంచడం తో పాటు అక్కడ పాట వుంది అన్న విషయాన్ని కూడా మర్చిపోతారు ప్రేక్షకులు. అదే సిట్యుయేషనల్ సాంగ్ యొక్క మహిమ. సిట్యుయేషనల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుడిని తాదాత్మ్యం చెందించవచ్చు.

కాబట్టే మల్లేశ్వరి(1951), అన్నమయ్య, పెళ్లి సందడి, రామదాసు, లాంటి సినిమాలు అద్భుత విజయాన్ని సాధించాయి.


మీకు తెలుసా..?


బాహు బలి లో ఎన్ని పాటలు ఉన్నాయి..? ఎంత డ్యూరేషన్ వుంది ..?

బాహుబలి -1 (2015)  

8  పాటలు ..  27 -08 నిమిషాలు.

బాహుబలి -2  (2017) 

5  పాటలు .. 17 -57  నిమిషాలు


హుషారు (చిన్న సినిమా- 2018)

8  పాటలు - 30-13  నిమిషాలు

(బాక్స్ ఆఫీస్ దగ్గర దంచి కొట్టింది)

కమిటీ కుర్రోళ్ళు(చిన్న సినిమా-2024 )

10 పాటలు - 36-10 నిమిషాలు

(బాక్స్ ఆఫీస్ దగ్గర దంచి కొట్టింది)

సరిపోదా శనివారం

(మీడియం సినిమా-2024)

12  పాటలు - 39-49  నిమిషాలు

(బాక్స్ ఆఫీస్ దగ్గర దంచి కొట్టింది)

ఇవన్నీ బాహుబలి కన్నా పాటల విషయంలో total duration ఎక్కువే కదా..!

అన్నీ హిట్ సినిమాలే. దేని స్థాయి దానిదే. ఏ విజయాన్ని ఎవ్వడూ ఆపలేడు. పనిలో వుండాల్సింది శ్రద్ద, శక్తీ, భక్తి అంతే. 

సో ఫైనల్ కంక్లూజన్.


ఒక సినిమాకి ఎన్ని పాటలు ఉండాలి అని నిర్ధారించేంది జోనర్, కంటెంట్ అండ్ దర్శకుడి విజన్. దర్శకుడి దగ్గర దమ్ము ఉంటె ప్రేక్షకుడు ఎన్ని పాటలైనా వింటాడు, చూస్తాడు అదే ఫైనల్. దర్శకుడు ప్రేక్షకుడిని కొంచెం కొంచెంగా ఎంగేజ్ చెయ్యగలగాలి అంతే.


In this generation 20 to 30 minutes songs duration is very very reasonable and NO more issues.


ఫిర్ మిలేంగే

Rama Krishna Rao Balusu.



 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 
 
 

చాలా మంది ఫాన్స్ మా సినిమా ఇన్ని కోట్లు వచ్చింది – అన్ని కోట్లు వచ్చింది, ఇండస్ట్రీ హిట్ అని ఢంకా భజాయించి చెబుతుంటారు. కానీ అవన్నీ అభిమానంతో చేసే వ్యాఖ్యలే కానీ వాస్తవాలు కావు. మరికొంత మంది "గ్రాస్ వసూళ్ళు" గురించి మాట్లాడతారు. దానివల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ‘షేర్’గా వచ్చిన వసూళ్ళు మాత్రమే అధికారికంగా ఆమోదిస్తారు.


గ్రాస్ ... అంటే టికెట్లు అమ్మగా వచ్చిన వసూళ్ళు మొత్తం.

నెట్ ... అంటే మొత్తం వసూళ్ళు నుండి టాక్స్, ఐ.ఎన్.ఆర్. వంటివి తీసేస్తే వచ్చిన మొత్తం.

షేర్ ... అంటే నెట్ లోంచి ధియేటర్ అద్దె తీసేస్తే వచ్చిన వచ్చిన మొత్తం.


గ్రాస్, నెట్ వసూళ్ళ గురించి మరిచిపోండి. " షేర్ వసూళ్ళని " మాత్రమే నమ్మండి. ఎందుకంటే అదే "వాస్తవం కనుక" (Is that clear..?)


కలెక్షన్ ఎంత వచ్చింది అన్న దాని మీద హిట్ సినిమా, బ్లాక్ బస్టర్ అని ఆధారపడి ఉండదు. ఎంత పెట్టుబడి పెడితే, ఎంత వసూళ్ళు వచ్చాయి ?, ఎంత లాభం వచ్చింది? ఎంత నష్టం వచ్చింది ? అనే దాని పైనే, డిజాస్టర్ సినిమా నుంచి ఇండస్ట్రీ హిట్ సినిమా వరకు ఆధారపడి ఉంటాయి. ఒక సినిమాని నిర్మాత నిర్మించిన తర్వాత ఆ సినిమాని ప్రేక్షకుడు డైరెక్టుగా చూడలేడు. ప్రేక్షకుడు చూడాలంటే ఒక వారధి, ఒక వ్యవస్థ కావాలి, దాని పేరే "డిస్త్రిబ్యూషన్". డిస్త్రిబ్యూటర్లు, నిర్మాత దగ్గర నుంచి ఏరియాల వారీగా ఒక ధరకు కొనుగోలు చేసి థియేటర్ల ద్వారా విడుదల చేస్తారు.. అప్పుడు మాత్రమే ప్రేక్షకుడు సినిమాని థియేటర్ లో చూడగలడు. అంటే సినిమా అనే వ్యవస్థకు "డిస్ట్రిబ్యూటర్ వెన్నెముక లాంటి వాడు" అని చెప్పవచ్చు. ఇప్పుడు, పెట్టుబడి, రాబడి సూత్రం ద్వారా ఒక సినిమా హిట్ అయిందా లేక ఫట్ అయిందా అని వర్గీకరించడానికి "ఎంత వసూలు చేసింది ..?" అనేది ముఖ్యం కదా. వసూళ్ళని బట్టి సినిమాని సూక్ష్మంగా ఎనిమిది స్థాయిలుగా వర్గీకరించ వచ్చు.


01. డిజాస్టర్ సినిమా - పెట్టిన పెట్టుబడిలో 50 శాతం కూడా తిరిగి రానిది(బయ్యర్లు మరియు ఎగ్జిబిటర్లకు) :

ఉదా : కొమరం పులి (2010), శక్తి(ఎన్టీఆర్ -2011), రెబెల్, అధినాయకుడు (2012), జంజీర్, షాడో(2013), 1 నేనొక్కడినే (2014),అఖిల్ (2015), సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం (2016), స్పైడర్, విన్నర్ (2017), ఇంటిలిజెంట్, అజ్నాతవాసి, నాగార్జున ఆఫీసర్ (2018), ఎన్టీఆర్ కధానాయకుడు, మహా నాయకుడు, వినయ విధేయ రామ (2019), డిస్కో రాజా, వరల్డ్ ఫేమస్ లవర్(2020), మహా సముద్రం (2021), ఖిలాడి, రాధే శ్యాం, గని, ఆచార్య (2022) వంటివి. ప్రింటు ఖర్చులు కూడా రాని సినిమాలు చాలానే వున్నాయి... ప్రస్తుతానికి వాటిని వదిలేద్దాం.

.

02. ఫ్లాప్ సినిమా - పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రానిది(నిర్మాత, బయ్యర్లు మరియు ఎగ్జిబిటర్లకు)

ఉదా : ఆగడు, భాయ్, తీన్మార్, ఆరెంజ్, షేర్, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, జై లవకుశ, నా పేరు సూర్య, కాటమరాయుడు, మన్మధుడు 2,, డియర్ కామ్రేడ్,రూలర్, చాణక్య, రణరంగం వంటివి.


03. సేఫ్ సినిమా - పెట్టిన పెట్టుబడి మాత్రమే తిరిగి వచ్చి లాభం లేనిది (బయ్యర్లు మరియు ఎగ్జిబిటర్లకు - బ్రేక్ ఈవెన్ అన్నమాట)

ఉదా : బెంగాల్ టైగర్, ఎవడే సుబ్రహ్మణ్యం, ధృవ, జెర్సీ, జనతా గారెజ్ (2016), ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి (2017), భరత్ అనే నేను, భాగమతి, (2018), మహర్షి(2019), భీష్మ(2020), లవ్ స్టొరీ, మోస్ట్ ఎలిజిబుల్ బాచెలర్(2021), భీమ్లా నాయక్(2022) వంటివి.


04. హిట్ సినిమా1 రూపాయికి 1 రూపాయి పైన లాభం తెచ్చేది.

మగధీర, అత్తారింటికి దారేది, శ్రీమంతుడు, పటాస్, సోగ్గాడే చిన్ని నాయన, కాంచన-3, బాహుబలి ది బిగినింగ్ (2015), రంగస్థలం (2018), మజిలీ , ఇస్మార్ట్ శంకర్ (2019), అల వైకుంఠపురములో -(2020), అఖండ,(2021) ,వీరం (తమిళ్), సాండ్రా బుల్లక్ నటించిన టూ వీక్స్ నోటీస్ (2002-ఇంగ్లీష్), డి జె టిల్లు, RRR (2022) వంటివి.


05. సూపర్ హిట్ సినిమా - 1 రూపాయికి 3 రూపాయిల పైన లాభం తెచ్చేది.

ఆది, స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, సినిమా చూపిస్తా మావ, కుమారి ఎఫ్ 21, ఎక్స్ ప్రెస్ రాజా, ఎక్కడికీ పోతావు చిన్నవాడా, RX 100, బాహుబలి ది కంక్లూజన్(2017) ,ఫిదా (2017), గీత గోవిందం, మహానటి (2018), F2, హాలీవుడ్లో అయితే కిల్ బిల్ -2(2004), డెంజెల్ వాషింగ్టన్ “ది ఈక్వలైజర్”(2014), ఫేస్ ఆఫ్(నికోలస్ కేజ్, జాన్ ట్రవోల్టా), ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్(క్వెంటిన్ టేరంటినో డైరెక్టర్, పెట్టుబడి - సుమారు 455 కోట్లు, రాబడి - సుమారు 2093 కోట్లు), వంటివి.


06. సూపర్ డూపర్ హిట్ సినిమా - 1 రూపాయికి 5 రూపాయిల పైన లాభం తెచ్చేది.

రాజుగారి గది, ఈ రోజుల్లో, ప్రేమ కధా చిత్రం, ఉయ్యాలా జంపాలా, జయం, అర్జున్ రెడ్డి (2017), తనీ వరువన్ (తమిళం), బధాయి హో (2018-hindi), కాశ్మీర్ ఫైల్స్ (2022-hindi), హాలీవుడ్ లో కిల్ బిల్ -1(2003) వంటివి.


07. బ్లాక్ బస్టర్ సినిమా - 1 రూపాయికి 10 రూపాయిలు లాభం తెచ్చేది.

బిచ్చగాడు, పెళ్లి చూపులు, చిత్రం, నువ్వు నేను, నువ్వే కావాలి, యమలీల, క్షణం, జాతి రత్నాలు(2021) , పసంగా -2(తమిళ్), అంధాధున్(2018-hindi), హాలీవుడ్ లో స్కార్లెట్ జాన్సన్ “లూసీ”(2014), మైఖేల్ డగ్లస్ నటించిన "కోమా" (1978) వంటివి.


08. ఇండస్ట్రీ హిట్ సినిమా - 1 రూపాయికి 10 రూపాయిల పైన లాభం తెచ్చేది.

అడవి రాముడు(1977), శంకరాభరణం(తమిళనాడు వంటి కొన్ని చోట్ల), శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర(1984), షోలే(హిందీ -1975) వంటివి. 2016 లో ఓవర్సీస్ లో పెళ్లిచూపులు బయ్యర్ కి 22 రెట్లు (14 లక్షల పెట్టుబడికి 3 కోట్ల లాభం) లాభం వచ్చింది.


ఇండస్ట్రీ హిట్ అని అభిమానులు చెప్పుకునే సినిమాలు నిజంగానే నిజమో కాదో ఒకసారి అవి కలెక్ట్ చేసిన కలెక్షన్లతో బేరీజు వేసి చూద్దాం.


టాలీవుడ్ మార్కెట్ గురించి :


బాహుబలి ది బిగినింగ్ - పెట్టుబడి సుమారు 150 కోట్లు. వసూళ్ళు సుమారు 330 కోట్లు, అంటే రూపాయికి, రూపాయి-ఇరవై పైసలు లాభం. అంటే సాధారణమైన హిట్ అన్నమాట.

శ్రీమంతుడు - పెట్టుబడి సుమారు 50 కోట్లు. వసూళ్ళు సుమారు 100 కోట్లు, అంటే రూపాయికి, రూపాయి లాభం. అంటే సాధారణమైన హిట్ అన్నమాట.

జనతా గారేజ్ - పెట్టుబడి సుమారు 55 కోట్లు. వసూళ్ళు సుమారు 85 కోట్లు, అంటే రూపాయికి, అరవై పైసలు లాభం. అంటే సాధారణమైన హిట్ అన్నమాట.

అత్తారింటికి దారేది - పెట్టుబడి సుమారు 45 కోట్లు. వసూళ్ళు సుమారు 74 కోట్లు, అంటే రూపాయికి 70 పైసలు లాభం అంటే సాధారణమైన హిట్ అన్నమాట.

మగధీర - పెట్టుబడి సుమారు 35 కోట్లు. వసూళ్ళు సుమారు 73 కోట్లు, అంటే రూపాయికి రూపాయి లాభం. అంటే సాధారణమైన హిట్ అన్నమాట.

RRR : పెట్టుబడి సుమారు 450 కోట్లు. వసూళ్ళు సుమారు 800 కోట్లు, అంటే రూపాయికి రూపాయి లాభం. అంటే సాధారణమైన హిట్ అన్నమాట.

రాజుగారి గది – పెట్టుబడి సుమారు 3 కోట్లు. వసూళ్ళు సుమారు 18 కోట్లు, అంటే రూపాయికి - 5 రూపాయిలు లాభంతో సూపర్ డూపర్ హిట్ అన్న మాట.

నువ్వు నేను - పెట్టుబడి సుమారు రెండున్నర కోట్లు. వసూళ్ళు సుమారు 25 కోట్లు, అంటే రూపాయికి- 10 రూపాయిలు లాభంతో బ్లాక్ బస్టర్ అన్న మాట.

నువ్వే కావాలి - పెట్టుబడి సుమారు రెండున్నర కోట్లు. వసూళ్ళు సుమారు 26 కోట్లు, అంటే రూపాయికి- 10 రూపాయిలు లాభంతో బ్లాక్ బస్టర్ అన్న మాట.

అడవి రాముడు - పెట్టుబడి సుమారు 20 లక్షలు. వసూళ్ళు సుమారు 4 కోట్లు. అంటే రూపాయికి -20 రూపాయిలు లాభంతో ఇండస్ట్రీ హిట్ అన్న మాట.


హాలీవుడ్ మార్కెట్ గురించి :


COMA (1978) : పెట్టుబడి సుమారు 4 మిలియన్లు, వసూళ్ళు సుమారు 50 మిలియన్లు, అంటే ఒక రూపాయికి - 12 రూపాయిలు లాభంతో ఇండస్ట్రీ హిట్ అన్న మాట.

FACE OFF(1997) : పెట్టుబడి సుమారు 532 కోట్లు. వసూళ్ళు సుమారు 1,690 కోట్లు, అంటే ఒక రూపాయికి- 2 రూపాయిలు లాభంతో సాధారణమైన హిట్ అన్నమాట.

KILL BILL VOLUME 1(2003) : పెట్టుబడి సుమారు 30మిలియన్ డాలర్స్. వసూళ్ళు సుమారు 181మిలియన్ డాలర్స్. అంటే ఒక రూపాయికి - 5 రూపాయిలు లాభంతో సూపర్ డూపర్ హిట్ అన్న మాట.

KILL BILL VOLUME 2(2004) : పెట్టుబడి సుమారు 30మిలియన్ డాలర్స్. వసూళ్ళు సుమారు 153మిలియన్ డాలర్స్. అంటే ఒక రూపాయికి - 4 రూపాయిలు లాభంతో సూపర్ హిట్ అన్న మాట.

AVATAR (2009) : పెట్టుబడి సుమారు 1660 కోట్లు. వసూళ్ళు సుమారు 20,000 కోట్లు, అంటే ఒక రూపాయికి- 12 రూపాయిలు లాభంతో ఇండస్ట్రీ హిట్ అన్న మాట.

GONE GIRL(2014) : పెట్టుబడి సుమారు 396 కోట్లు. వసూళ్ళు సుమారు 2,400 కోట్లు, అంటే ఒక రూపాయికి - 5 రూపాయిలు లాభంతో సూపర్ డూపర్ హిట్ అన్న మాట.

LUCY (2014) : పెట్టుబడి సుమారు 273 కోట్లు. వసూళ్ళు సుమారు 3,220 కోట్లు, అంటే ఒక రూపాయికి - 11 రూపాయిలు లాభంతో ఇండస్ట్రీ హిట్ అన్న మాట.

AVENGERS ENDGAME (2019) : పెట్టుబడి సుమారు 2700 కోట్లు. వసూళ్ళు సుమారు 21,000 కోట్లు, అంటే ఒక రూపాయికి- 8 రూపాయిలు లాభంతో సూపర్ డూపర్ హిట్ అన్న మాట.

JOKER (2019) : పెట్టుబడి సుమారు 400 కోట్లు. వసూళ్ళు సుమారు 3,200 కోట్లు, అంటే ఒక రూపాయికి- 8 రూపాయిలు లాభంతో బ్లాక్ బస్టర్ అన్న మాట.


UNBEATABLE RECORD for EVERY INDUSTRY : - - - - -

PARANORMAL ACTIVITY(2009) : పెట్టుబడి సుమారు 3 కోట్లు. . వసూళ్ళు సుమారు - 300 కోట్లు. అంటే ఒక రూపాయికి - 100 రూపాయిలు లాభంతో UNBELEIVABLE ఇండస్ట్రీ హిట్ అన్న మాట. (ఈ రికార్డుని కొట్టాలంటే ఎంత కాలం వేచి చూడాలో మరి. KUDOS TO DIRECTOR "OREN PELI").


1 రూపాయికి కనీసం 10 రూపాయిల పైన లాభం తెచ్చేది మాత్రమే ఇండస్ట్రీ హిట్ సినిమా అని నూటికి నూరు పాళ్ళూ నిర్ధారించవచ్చు. కాబట్టి సినీ వర్గాలు, అభిమానులందరూ అపోహలను తొలగించుకోవాలని మనవి.










తెలుగు సినిమా దాదాపుగా షష్టి పూర్తి చేసుకుంటున్న తరుణంలో “ఉవ్వెత్తున ఎగసి పడిన కల్లోల కడలిలా” రామ్ గోపాల్ వర్మ తీసినశివ’ సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. 1989లో విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమాకి కొత్త టెక్నిక్, కొత్త ప్రెజంటేషన్, కొత్త వయొలెన్స్ లను పరిచయం చేసి సమూలమైన మార్పులతో స్పీడ్ యుగానికి శ్రీకారం చుట్టింది. ఒక విధంగా ఫక్తు కమర్షియల్ ఫార్మాట్-కి, క్రైం జోడించటం మొదలైంది ఈ సినిమాతోనే. దీనికి ముందు 1977లో విడుదల అయినఅడవి రాముడు’ (20 లక్షల పెట్టుబడికి 4 కోట్లకు పైగా రాబడి), తెలుగు సినిమాను పూర్తి వ్యాపారాత్మకంగా మార్చడానికి బీజాన్ని వేస్తే, ‘శివ’ దాన్ని వట వృక్షంగా మార్చి వేసింది. శివ సినిమా ప్రభావం వల్ల, చిత్ర నిర్మాణంలో స్పీడు పెరిగి, క్వాలిటీ తగ్గి విజయావకాశాల శాతం డైల్యూట్(పలుచన) అయి (వెహికిల్ ఇంజన్ సి.సి. పెరిగే కొద్దీ మైలేజ్ తగ్గినట్టుగా) తెలుగు సినిమా వరం లాంటి శాపాన్ని ఆమోదించింది. 1989 తర్వాత తెలుగు సినిమా చిత్ర నిర్మాణంలో గానీ, నడకలో గానీ, పాటల్లో గానీ, ఫైట్లలో గానీ, న్యూ వేవ్ కమర్షియల్ ఫార్మాట్లో శరవేగంగా పరుగులు పెడుతూ “కళకి ఉన్న ఆత్మను” కోల్పోయింది. 1989 నుండి 2022 వరకు అంటే ఈ 32 ఏళ్ల కాలాన్ని రెండు దశలుగా విభజించవచ్చు.


రిఫ్రెషింగ్ ఏజ్ (నవ్య దశ ) .. 1989 నుండి 1999 వరకు .. 11 ఏళ్లు

2కె ఏజ్ (మిలీనియం దశ) .. 2000 నుండి 2024 వరకు .. 24 ఏళ్లు


నవ్య దశ (1989 నుండి 1999) : శివ సినిమా ప్రభావంతో కథలన్నీ క్రైం అండ్ వయొలెన్స్ చుట్టూ తిరగడం మొదలు పెట్టాయి. దిగ్దర్శకులతో పాటుగా కొత్త దర్శకుల శకం కూడా ప్రారంభమైంది. ఆ కోవలోనే న్యూవేవ్ దర్శకులుగా రామ్ గోపాల్ వర్మ, ఇ.వి.వి. సత్యనారాయణ, విజయబాపినీడు, ప్రియదర్శన్, ఫాజిల్, ఎస్.వి. కృష్ణారెడ్డి, గుణశేఖర్, కృష్ణ వంశీ, కరుణాకరన్, వై.వి.ఎస్. చౌదరి, విజయభాస్కర్, శ్రీను వైట్ల, పి.ఎ. అరుణ్ ప్రసాద్ వంటి యువ దర్శకులు తమదైన శైలిలో ముద్ర వేసారు. శివ, అంకుశం, బొబ్బిలి రాజా, జగదేకవీరుడు -అతిలోకసుందరి, ప్రేమ ఖైదీ, నారీనారీ నడుమ మురారి, ఆదిత్య 369 ,గ్యాంగ్ లీడర్, అల్లరి ప్రియుడు, యమలీల, పెళ్లి సందడి, ఘరానా మొగుడు, భైరవ ద్వీపం, గులాబి, నిన్నే పెళ్ళాడుతా, అన్నమయ్య, పెళ్లి, శుభాకాంక్షలు, తొలిప్రేమ, దేవి, రాజకుమారుడు, సమర సింహారెడ్డి వంటి చిత్రాలతో తెలుగు సినిమాని ఉర్రూతలూగించారు.


మిలీనియం దశ (2000 నుండి 2015) : క్రైం అండ్ వయొలెన్స్ సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులు ప్రేమ కథా చిత్రాల వైపు మొగ్గు చూపిన దశే మిలీనియం దశ. బాక్స్ఆఫీస్ పూర్తిగా యూత్ & మాస్ చేతుల్లోకి వెళ్ళిపోయింది కూడా ఈ దశే. 1990 దశకంలో ప్రారంభమైన ‘బుల్లి తెర’ హవా కూడా మొదలై మహిళా ప్రేక్షకులను బుల్లి తెరకు మాత్రమే పరిమితం చేయటం వల్ల, తెలుగు సినిమాకి ‘యువత’ ‘మాస్ ప్రేక్షకులు’ మహారాజ పోషకులుగా మారిపోయారని నిర్ధారణకు వచ్చిన నిర్మాత, దర్శకులు “యువ- చిత్ర – కథలతో ’’ లవ్ ని ప్రధాన అంశంగా చేసుకుని వెండి తెరని రొమాన్స్ వైపు పరిగెత్తించారు. దానికి తోడు 2కె కాలంలో ‘రియల్ ఎస్టేట్ బూమ్’లో బాగా సంపాదించిన చిన్న సైజు బిల్డర్లు కూడా పెద్ద నిర్మాతలుగా మారిపోయి సినిమా విలువలు – విజయాల శాతం పడిపోవటానికి, తన వంతు కృషిని చాలా శ్రద్దగా చేశారు. రాం గోపాల్ వర్మతో పాటుగా ఆయన శిష్య పరంపర విజ్రుంభణ కూడా మొదలైంది. మిలీనియం డైరెక్టర్లుగా పూరీ జగన్నాధ్, తేజ, ఎస్.ఎస్. రాజమౌళి, ఎస్.జే. సూర్య, కాశీ విశ్వనాద్, వి.వి. వినాయక్, అల్లరి రవి బాబు, త్రివిక్రం శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, జయ, సూర్య కిరణ్, నీలకంట , సుకుమార్, ఎ.ఎస్. రవి కుమార్ చౌదరి, చంద్రశేఖర్ ఏలేటి, శేఖర్ కమ్ముల, ప్రభుదేవా, సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను, రమేష్ వర్మ, హరీష్ శంకర్, మోహన్ కృష్ణ, ఇంద్రగంటి, క్రిష్,, మెహెర్ రమేష్, నందినీ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి,, సుధీర్ వర్మ, శ్రీవాస్, వంశీ పైడిపల్లి, మారుతి, విక్రం కుమార్, దేవ్ కట్టా, సంతోష్ శ్రీనివాస్, గోపీచంద్ మలినేని, సంపత్ నంది, ఓంకార్ అనిల్ రావిపూడి, వంగా సందీప్ వంటి వారు - చిత్రం, బద్రి, నువ్వే కావాలి, నరసింహ నాయుడు, ఖుషీ, ఆది, ఇంద్ర, ఒక్కడు, సింహాద్రి, ఠాగూర్, వర్షం, ఆర్య, ఐతే, యజ్ఞం, ఆనంద్, 7జి.బృందావన్ కాలనీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతనొక్కడే, భద్ర, అతడు, పోకిరి, చత్రపతి, యమదొంగ, గమ్యం, మగధీర, అరుంధతి, సింహ, కిక్, దూకుడు, గబ్బర్ సింగ్, ఈగ, అత్తారింటికి దారేది, లెజెండ్, బలుపు, బాహుబలి, రుద్రమ దేవి, శ్రీమంతుడు, అర్జున్ రెడ్డి, రాజు గారి గది, మహానటి, రంగస్థలం, F2, అల వైకుంఠపురములో, అఖండ, వంటి చిత్రాలతో తెలుగు సినిమాని కొత్త పుంతలు తొక్కించారు, ముఖ్యంగా 'బాహుబలి ది బిగినింగ్', 'బాహుబలి ది కంక్లూజన్ ', RRR వంటి సినిమాలతో రాజమౌళి తెలుగు సినిమాకి అంతర్జాతీయంగా గుర్తింపుని తీసుకొచ్చి తెలుగు వారంతా గర్వ పడేలా చేశాడు.


సాంకేతికంగా మిలీనియంలో తెలుగు సినిమా మరింతగా ఎదిగింది. డి.టి.ఎస్. సౌండ్ టెక్నాలజీతో (మాస్టర్ -1997) దూసుకుపోయి, డాల్బీ ఎట్మోస్, (బాహుబలి -2015), 3డి-70 ఎం.ఎం.గా (రుద్రమదేవి -2015) విజ్రుంభించి, డాల్బీ విజన్ (RRR-2022) గా విస్తరించి, తెలుగు వాడి సత్తాని జాతీయ స్థాయిలో వినిపించింది. మాన్యువల్ ఎడిటింగ్ నుంచి యావిడ్ వైపు, అనలాగ్ మ్యూజిక్ నుంచి డిజిటల్ మ్యూజిక్ వైపు, ల్యాబ్ ప్రింట్ల నుండి శాటిలైట్ డౌన్ లోడ్ డిజిటల్ ప్రింట్ల (క్యూబ్, యు.ఎఫ్.ఓ, పి.ఎక్స్.డి) వైపుగా పయనించి, 4కె నుంచి 5 K రిజేల్యుషన్ సాక్షిగా తెలుగు వారికి క్వాలిటీ సినిమాని చూపించింది.


అయితే రాశి పెరిగినా వాసి తగ్గడానికి కారణం ఏమిటి? ఈ 32 ఏళ్ల కాలంలో తెలుగు సినిమా విజయాల శాతం సంవత్సరానికి 10 % నుండి 20% మధ్యనే ఎలా ఆగిపోయింది ? ఎన్ని సినిమాలు విడుదల అయ్యాయి ? ఎన్ని సినిమాలు విజయాన్ని సాధించాయి ? పూర్తి వివరాలతో మళ్ళీ కలుద్దాం.



 
 
 

© 2022  Pothavaram Talkies.  All Rights Reserved.

bottom of page