హిట్టుకీ.. ఇండస్ట్రీ హిట్టుకీ.. తేడా ఏమిటి ?
- rkr BALUSU
- Apr 16, 2022
- 4 min read
Updated: Aug 20, 2022

చాలా మంది ఫాన్స్ మా సినిమా ఇన్ని కోట్లు వచ్చింది – అన్ని కోట్లు వచ్చింది, ఇండస్ట్రీ హిట్ అని ఢంకా భజాయించి చెబుతుంటారు. కానీ అవన్నీ అభిమానంతో చేసే వ్యాఖ్యలే కానీ వాస్తవాలు కావు. మరికొంత మంది "గ్రాస్ వసూళ్ళు" గురించి మాట్లాడతారు. దానివల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ‘షేర్’గా వచ్చిన వసూళ్ళు మాత్రమే అధికారికంగా ఆమోదిస్తారు.
గ్రాస్ ... అంటే టికెట్లు అమ్మగా వచ్చిన వసూళ్ళు మొత్తం.
నెట్ ... అంటే మొత్తం వసూళ్ళు నుండి టాక్స్, ఐ.ఎన్.ఆర్. వంటివి తీసేస్తే వచ్చిన మొత్తం.
షేర్ ... అంటే నెట్ లోంచి ధియేటర్ అద్దె తీసేస్తే వచ్చిన వచ్చిన మొత్తం.
గ్రాస్, నెట్ వసూళ్ళ గురించి మరిచిపోండి. " షేర్ వసూళ్ళని " మాత్రమే నమ్మండి. ఎందుకంటే అదే "వాస్తవం కనుక" (Is that clear..?)
కలెక్షన్ ఎంత వచ్చింది అన్న దాని మీద హిట్ సినిమా, బ్లాక్ బస్టర్ అని ఆధారపడి ఉండదు. ఎంత పెట్టుబడి పెడితే, ఎంత వసూళ్ళు వచ్చాయి ?, ఎంత లాభం వచ్చింది? ఎంత నష్టం వచ్చింది ? అనే దాని పైనే, డిజాస్టర్ సినిమా నుంచి ఇండస్ట్రీ హిట్ సినిమా వరకు ఆధారపడి ఉంటాయి. ఒక సినిమాని నిర్మాత నిర్మించిన తర్వాత ఆ సినిమాని ప్రేక్షకుడు డైరెక్టుగా చూడలేడు. ప్రేక్షకుడు చూడాలంటే ఒక వారధి, ఒక వ్యవస్థ కావాలి, దాని పేరే "డిస్త్రిబ్యూషన్". డిస్త్రిబ్యూటర్లు, నిర్మాత దగ్గర నుంచి ఏరియాల వారీగా ఒక ధరకు కొనుగోలు చేసి థియేటర్ల ద్వారా విడుదల చేస్తారు.. అప్పుడు మాత్రమే ప్రేక్షకుడు సినిమాని థియేటర్ లో చూడగలడు. అంటే సినిమా అనే వ్యవస్థకు "డిస్ట్రిబ్యూటర్ వెన్నెముక లాంటి వాడు" అని చెప్పవచ్చు. ఇప్పుడు, పెట్టుబడి, రాబడి సూత్రం ద్వారా ఒక సినిమా హిట్ అయిందా లేక ఫట్ అయిందా అని వర్గీకరించడానికి "ఎంత వసూలు చేసింది ..?" అనేది ముఖ్యం కదా. వసూళ్ళని బట్టి సినిమాని సూక్ష్మంగా ఎనిమిది స్థాయిలుగా వర్గీకరించ వచ్చు.
01. డిజాస్టర్ సినిమా - పెట్టిన పెట్టుబడిలో 50 శాతం కూడా తిరిగి రానిది(బయ్యర్లు మరియు ఎగ్జిబిటర్లకు) :
ఉదా : కొమరం పులి (2010), శక్తి(ఎన్టీఆర్ -2011), రెబెల్, అధినాయకుడు (2012), జంజీర్, షాడో(2013), 1 నేనొక్కడినే (2014),అఖిల్ (2015), సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం (2016), స్పైడర్, విన్నర్ (2017), ఇంటిలిజెంట్, అజ్నాతవాసి, నాగార్జున ఆఫీసర్ (2018), ఎన్టీఆర్ కధానాయకుడు, మహా నాయకుడు, వినయ విధేయ రామ (2019), డిస్కో రాజా, వరల్డ్ ఫేమస్ లవర్(2020), మహా సముద్రం (2021), ఖిలాడి, రాధే శ్యాం, గని, ఆచార్య (2022) వంటివి. ప్రింటు ఖర్చులు కూడా రాని సినిమాలు చాలానే వున్నాయి... ప్రస్తుతానికి వాటిని వదిలేద్దాం.
.
02. ఫ్లాప్ సినిమా - పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రానిది(నిర్మాత, బయ్యర్లు మరియు ఎగ్జిబిటర్లకు)
ఉదా : ఆగడు, భాయ్, తీన్మార్, ఆరెంజ్, షేర్, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, జై లవకుశ, నా పేరు సూర్య, కాటమరాయుడు, మన్మధుడు 2,, డియర్ కామ్రేడ్,రూలర్, చాణక్య, రణరంగం వంటివి.
03. సేఫ్ సినిమా - పెట్టిన పెట్టుబడి మాత్రమే తిరిగి వచ్చి లాభం లేనిది (బయ్యర్లు మరియు ఎగ్జిబిటర్లకు - బ్రేక్ ఈవెన్ అన్నమాట)
ఉదా : బెంగాల్ టైగర్, ఎవడే సుబ్రహ్మణ్యం, ధృవ, జెర్సీ, జనతా గారెజ్ (2016), ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి (2017), భరత్ అనే నేను, భాగమతి, (2018), మహర్షి(2019), భీష్మ(2020), లవ్ స్టొరీ, మోస్ట్ ఎలిజిబుల్ బాచెలర్(2021), భీమ్లా నాయక్(2022) వంటివి.
04. హిట్ సినిమా – 1 రూపాయికి 1 రూపాయి పైన లాభం తెచ్చేది.
మగధీర, అత్తారింటికి దారేది, శ్రీమంతుడు, పటాస్, సోగ్గాడే చిన్ని నాయన, కాంచన-3, బాహుబలి ది బిగినింగ్ (2015), రంగస్థలం (2018), మజిలీ , ఇస్మార్ట్ శంకర్ (2019), అల వైకుంఠపురములో -(2020), అఖండ,(2021) ,వీరం (తమిళ్), సాండ్రా బుల్లక్ నటించిన టూ వీక్స్ నోటీస్ (2002-ఇంగ్లీష్), డి జె టిల్లు, RRR (2022) వంటివి.
05. సూపర్ హిట్ సినిమా - 1 రూపాయికి 3 రూపాయిల పైన లాభం తెచ్చేది.
ఆది, స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, సినిమా చూపిస్తా మావ, కుమారి ఎఫ్ 21, ఎక్స్ ప్రెస్ రాజా, ఎక్కడికీ పోతావు చిన్నవాడా, RX 100, బాహుబలి ది కంక్లూజన్(2017) ,ఫిదా (2017), గీత గోవిందం, మహానటి (2018), F2, హాలీవుడ్లో అయితే కిల్ బిల్ -2(2004), డెంజెల్ వాషింగ్టన్ “ది ఈక్వలైజర్”(2014), ఫేస్ ఆఫ్(నికోలస్ కేజ్, జాన్ ట్రవోల్టా), ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్(క్వెంటిన్ టేరంటినో డైరెక్టర్, పెట్టుబడి - సుమారు 455 కోట్లు, రాబడి - సుమారు 2093 కోట్లు), వంటివి.
06. సూపర్ డూపర్ హిట్ సినిమా - 1 రూపాయికి 5 రూపాయిల పైన లాభం తెచ్చేది.
రాజుగారి గది, ఈ రోజుల్లో, ప్రేమ కధా చిత్రం, ఉయ్యాలా జంపాలా, జయం, అర్జున్ రెడ్డి (2017), తనీ వరువన్ (తమిళం), బధాయి హో (2018-hindi), కాశ్మీర్ ఫైల్స్ (2022-hindi), హాలీవుడ్ లో కిల్ బిల్ -1(2003) వంటివి.
07. బ్లాక్ బస్టర్ సినిమా - 1 రూపాయికి 10 రూపాయిలు లాభం తెచ్చేది.
బిచ్చగాడు, పెళ్లి చూపులు, చిత్రం, నువ్వు నేను, నువ్వే కావాలి, యమలీల, క్షణం, జాతి రత్నాలు(2021) , పసంగా -2(తమిళ్), అంధాధున్(2018-hindi), హాలీవుడ్ లో స్కార్లెట్ జాన్సన్ “లూసీ”(2014), మైఖేల్ డగ్లస్ నటించిన "కోమా" (1978) వంటివి.
08. ఇండస్ట్రీ హిట్ సినిమా - 1 రూపాయికి 10 రూపాయిల పైన లాభం తెచ్చేది.
అడవి రాముడు(1977), శంకరాభరణం(తమిళనాడు వంటి కొన్ని చోట్ల), శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర(1984), షోలే(హిందీ -1975) వంటివి. 2016 లో ఓవర్సీస్ లో పెళ్లిచూపులు బయ్యర్ కి 22 రెట్లు (14 లక్షల పెట్టుబడికి 3 కోట్ల లాభం) లాభం వచ్చింది.
ఇండస్ట్రీ హిట్ అని అభిమానులు చెప్పుకునే సినిమాలు నిజంగానే నిజమో కాదో ఒకసారి అవి కలెక్ట్ చేసిన కలెక్షన్లతో బేరీజు వేసి చూద్దాం.
టాలీవుడ్ మార్కెట్ గురించి :
బాహుబలి ది బిగినింగ్ - పెట్టుబడి సుమారు 150 కోట్లు. వసూళ్ళు సుమారు 330 కోట్లు, అంటే రూపాయికి, రూపాయి-ఇరవై పైసలు లాభం. అంటే సాధారణమైన హిట్ అన్నమాట.
శ్రీమంతుడు - పెట్టుబడి సుమారు 50 కోట్లు. వసూళ్ళు సుమారు 100 కోట్లు, అంటే రూపాయికి, రూపాయి లాభం. అంటే సాధారణమైన హిట్ అన్నమాట.
జనతా గారేజ్ - పెట్టుబడి సుమారు 55 కోట్లు. వసూళ్ళు సుమారు 85 కోట్లు, అంటే రూపాయికి, అరవై పైసలు లాభం. అంటే సాధారణమైన హిట్ అన్నమాట.
అత్తారింటికి దారేది - పెట్టుబడి సుమారు 45 కోట్లు. వసూళ్ళు సుమారు 74 కోట్లు, అంటే రూపాయికి 70 పైసలు లాభం అంటే సాధారణమైన హిట్ అన్నమాట.
మగధీర - పెట్టుబడి సుమారు 35 కోట్లు. వసూళ్ళు సుమారు 73 కోట్లు, అంటే రూపాయికి రూపాయి లాభం. అంటే సాధారణమైన హిట్ అన్నమాట.
RRR : పెట్టుబడి సుమారు 450 కోట్లు. వసూళ్ళు సుమారు 800 కోట్లు, అంటే రూపాయికి రూపాయి లాభం. అంటే సాధారణమైన హిట్ అన్నమాట.
రాజుగారి గది – పెట్టుబడి సుమారు 3 కోట్లు. వసూళ్ళు సుమారు 18 కోట్లు, అంటే రూపాయికి - 5 రూపాయిలు లాభంతో సూపర్ డూపర్ హిట్ అన్న మాట.
నువ్వు నేను - పెట్టుబడి సుమారు రెండున్నర కోట్లు. వసూళ్ళు సుమారు 25 కోట్లు, అంటే రూపాయికి- 10 రూపాయిలు లాభంతో బ్లాక్ బస్టర్ అన్న మాట.
నువ్వే కావాలి - పెట్టుబడి సుమారు రెండున్నర కోట్లు. వసూళ్ళు సుమారు 26 కోట్లు, అంటే రూపాయికి- 10 రూపాయిలు లాభంతో బ్లాక్ బస్టర్ అన్న మాట.
అడవి రాముడు - పెట్టుబడి సుమారు 20 లక్షలు. వసూళ్ళు సుమారు 4 కోట్లు. అంటే రూపాయికి -20 రూపాయిలు లాభంతో ఇండస్ట్రీ హిట్ అన్న మాట.
హాలీవుడ్ మార్కెట్ గురించి :
COMA (1978) : పెట్టుబడి సుమారు 4 మిలియన్లు, వసూళ్ళు సుమారు 50 మిలియన్లు, అంటే ఒక రూపాయికి - 12 రూపాయిలు లాభంతో ఇండస్ట్రీ హిట్ అన్న మాట.
FACE OFF(1997) : పెట్టుబడి సుమారు 532 కోట్లు. వసూళ్ళు సుమారు 1,690 కోట్లు, అంటే ఒక రూపాయికి- 2 రూపాయిలు లాభంతో సాధారణమైన హిట్ అన్నమాట.
KILL BILL VOLUME 1(2003) : పెట్టుబడి సుమారు 30మిలియన్ డాలర్స్. వసూళ్ళు సుమారు 181మిలియన్ డాలర్స్. అంటే ఒక రూపాయికి - 5 రూపాయిలు లాభంతో సూపర్ డూపర్ హిట్ అన్న మాట.
KILL BILL VOLUME 2(2004) : పెట్టుబడి సుమారు 30మిలియన్ డాలర్స్. వసూళ్ళు సుమారు 153మిలియన్ డాలర్స్. అంటే ఒక రూపాయికి - 4 రూపాయిలు లాభంతో సూపర్ హిట్ అన్న మాట.
AVATAR (2009) : పెట్టుబడి సుమారు 1660 కోట్లు. వసూళ్ళు సుమారు 20,000 కోట్లు, అంటే ఒక రూపాయికి- 12 రూపాయిలు లాభంతో ఇండస్ట్రీ హిట్ అన్న మాట.
GONE GIRL(2014) : పెట్టుబడి సుమారు 396 కోట్లు. వసూళ్ళు సుమారు 2,400 కోట్లు, అంటే ఒక రూపాయికి - 5 రూపాయిలు లాభంతో సూపర్ డూపర్ హిట్ అన్న మాట.
LUCY (2014) : పెట్టుబడి సుమారు 273 కోట్లు. వసూళ్ళు సుమారు 3,220 కోట్లు, అంటే ఒక రూపాయికి - 11 రూపాయిలు లాభంతో ఇండస్ట్రీ హిట్ అన్న మాట.
AVENGERS ENDGAME (2019) : పెట్టుబడి సుమారు 2700 కోట్లు. వసూళ్ళు సుమారు 21,000 కోట్లు, అంటే ఒక రూపాయికి- 8 రూపాయిలు లాభంతో సూపర్ డూపర్ హిట్ అన్న మాట.
JOKER (2019) : పెట్టుబడి సుమారు 400 కోట్లు. వసూళ్ళు సుమారు 3,200 కోట్లు, అంటే ఒక రూపాయికి- 8 రూపాయిలు లాభంతో బ్లాక్ బస్టర్ అన్న మాట.
UNBEATABLE RECORD for EVERY INDUSTRY : - - - - -
PARANORMAL ACTIVITY(2009) : పెట్టుబడి సుమారు 3 కోట్లు. . వసూళ్ళు సుమారు - 300 కోట్లు. అంటే ఒక రూపాయికి - 100 రూపాయిలు లాభంతో UNBELEIVABLE ఇండస్ట్రీ హిట్ అన్న మాట. (ఈ రికార్డుని కొట్టాలంటే ఎంత కాలం వేచి చూడాలో మరి. KUDOS TO DIRECTOR "OREN PELI").
1 రూపాయికి కనీసం 10 రూపాయిల పైన లాభం తెచ్చేది మాత్రమే ఇండస్ట్రీ హిట్ సినిమా అని నూటికి నూరు పాళ్ళూ నిర్ధారించవచ్చు. కాబట్టి సినీ వర్గాలు, అభిమానులందరూ అపోహలను తొలగించుకోవాలని మనవి.
Comentários